తెలుగుదేశం పార్టీలో బిసిలకు సముచిత న్యాయం కల్పిస్తాం

We will provide fair justice for the BC in the TDP

We will provide fair justice for the BC in the TDP

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీలో బిసిలకు సముచిత న్యాయం కల్పిస్తామని చౌడేపల్లె మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు గువ్వల రామక్రిష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షిలో బిసిలకు షాక్‌ అన్న కథనంపై ఆయన స్పందించారు. గతంలో శ్రీ బోయకొండ ఆలయ చైర్మన్లుగా పని చేసిన ఎస్‌కె.రమణారెడ్డి , ఆయన సతీమణి రతీదేవి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని, వారు పార్టీకి ఏనాడు పని చేయలేదన్నారు. ఎస్‌కె. రమణారెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని , ఇటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ, పార్టీ నేతలు ఎవరు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలతో, కార్యకర్తలతో చర్చించి, ఐకమత్యంతో బిసిలతో పాటు అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు.

దుర్గాదేవికి ప్రత్యేక పూజలు

Tags: We will provide fair justice for the BC in the TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *