ముఖ్యమంత్రి ఆశిస్తున్న సేవలు అందిస్తాం.

-తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి.

Date:02/12/2019

జగిత్యాల ముచ్చట్లు:

:ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్న సేవలు అంకితభావంతో అందిస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం ధర్మపురి లక్మినర్సింహ స్వామిని దర్శించి పూజలు చేశారు.అనంతరం ఆయన రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం తమపై ఉన్న నమ్మకాన్నీ నిలబెట్టుకుంటామన్నారు.పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించాలన్నారు.పార్ట్ బీ సమస్యల ను పరిష్కంచేందుకు తహశీల్దార్ లకుపూర్తి స్థాయి ఆప్షన్లు ఇవ్వాలన్నారు.న్యాయపరమైన అంశాలు పరిష్కరించడానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు.

 

 

 

 

నాయబ్ తాహసీల్దారులకు తహసీల్దార్ లుగా,తహసీల్దారులకు డిప్యూటీ కలెక్టర్లు గా పదోన్నతులు కల్పించడానికి, ఆర్డర్ టూ సర్వ్ బదిలీలు ,జనాభా ప్రాతిపదికన పోస్టులు ఏర్పాటుకు,తదితర సమస్యల త్వరగా  పరిష్కారానికి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని,హామీ ఇచ్చిన వెంటనే శాసనసభ ఎన్నికల సమయంలో వివిధ జిల్లాలకు బదీలీ చేసిన తాహశీల్దారులను తిరిగి పూర్వ జిల్లాలకు బదీలీ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. పీఆర్సీలో తహసీల్దారులకు,డిప్యూటీ కలెక్టర్ లకు ప్రత్యేక స్కేళ్ళు ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ కు విన్నవించామన్నారు.ఈ సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,జిల్లా రెవెన్యూ అధ్యక్షులు ఎం.డీ.వకీల్, ప్రధాన కార్యదర్శి చెలుకల కృష్ణ, తహసీల్దార్ వై.రవీందర్, డీటీ లు సుమన్,షాదాబ్ హకీమ్,గీర్దావర్ శృతి చరణ్,వేణుగోపాల్,అశోక్,గోపాల్,విఆర్వో లు,వీఆర్ఏ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టుల వారోత్సవాలు మాకొద్దు…

Tags: We will provide the services that the Chief Minister expects.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *