500 ఫోన్ లను రికవరీ చేసాం- ఎస్పి రిశాంత్ రెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ రిశాంత్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున చోరీకి గురైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరాలు వెల్లడించారు. ఒక బాధిరురాలి ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోపే మొబైల్ ఫోన్ రికవరీ చేసామని అన్నారు.ఇతర రాష్ట్రాల జిల్లాల నుండి రికవరీ చేసి బాధ్యతలకు అందజేశాం జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఢిల్లీ కేరళ బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ బాధ్యతల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధ్యతలు ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి ఫిర్యాదు చేస్తున్న బాధ్యతలు చాట్ బోట్ సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుందన్నారు. జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువగా అయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లు ఎటువంటి కంప్లీట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీసు వారి చాట్ బాట్ ల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మరల పొందవచ్చునని తెలిపారు 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందని ఎస్పీ అన్నారు. విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. బాధితులకు సెల్ ఫోన్లు అందజేశారు.
Tags; We will recover 500 phones – SP Rishanth Reddy

