పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Date;28/02/2020

పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి

రాజన్న సిరిసిల్లముచ్చట్లు

 

మధ్య మానేరు జలాశయం , అనంతగిరి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి  డా. రజత్ కుమార్ స్పష్టం  చేశారు. శుక్రవారం ముఖ్య కార్యదర్శి డా. రజత్ కుమార్ మధ్య మానేరు జలాశయం ను పరిష్క పరిశీలించి, పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు.  హెలికాప్టర్ ద్వారా కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్  హరి రామ్ , సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేల తో కలిసి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ మధ్య మానేరు  జలాశయం చేరుకొని… ప్రాజెక్టు ను పరిశీలించారు. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన డాక్టర్ రజత్ కుమార్, అధికారులకు కు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో
కలిసి డాక్టర్ రజత్ కుమార్ మద్య మానేరు జలాశయం కట్ట పైకి వెళ్లి అక్కడి నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవలే  నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో లో కాలేశ్వరం ప్రాజెక్టు లోని పలు ప్రాజెక్టులను క్షేత్ర  పరిశీలన చేయడం జరిగిందన్నారు . ఆ క్రమంలో మధ్య మానేరు జలాశయం పరిశీలించేందుకు వచ్చామన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అపరిష్కృత సమస్యలు, ఇంజనీరింగ్ సమస్యలు,  ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. అనంతగిరి ప్రాజెక్టుకు సంబంధించి స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం పై ప్రత్యేక దృష్టి  సారించి ఏమన్నారు. అనంతగిరి ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే మధ్య మానేరు జలాశయం నుంచి
అనంతగిరి ప్రాజెక్టు వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. నిర్వాసితులకు పరిహారం ప్రభుత్వ నిబంధనల మేరకే ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులందరికీ చట్టపరంగా పరిహారం అందిస్తామన్నారు.

Tags;We will resolve the pending issue quickly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *