మంచినీటి ప్రాజెక్టుల జోలికొస్తే తడాఖా చూపిస్తాం -బాబు దిష్టిబొమ్మ దగ్ధం
-ఉధ్యమిస్తున్న జనం
పుంగనూరు ముచ్చట్లు:

పడమటి నియోజకవ ర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు , కుప్పం ప్రాంతాలకు సాగునీరు-తాగునీరు అందనివ్వకుండ ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లె ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడుకు తడాఖా చూపిస్తామంటు ప్రజలు హెచ్చరించారు. శుక్రవారం నిరసనగా బాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి దగ్ధం చేశారు. రాష్ట్రజానపద కళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, లయన్స్క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ ఆధ్వర్యంలో ప్లెక్లిలు పట్టుకుని పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అంటు నినాదాలు చేశారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే ఉధ్యమం నిర్వహిస్తామని , ప్రాజెక్టుల జోలికొస్తే పచ్చనాయకులను భూస్థాపితం చేస్తామని , చంద్రబాబు డౌన్…డౌన్… అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంబిటి రోడ్డులో ర్యాలీ నిర్వహించి, ఇందిరా సర్కిల్‌లోని జాతీయ రహదారిపై బైఠాయించి ,చంద్రబాబు దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేసి నిరసన తెలిపారు.
నువ్వేందుకు ప్రాజెక్టులు కట్టలేదు…
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబునాయుడు పడమటి నియోజకవర్గాలలో ఒక్కతాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించారా అంటు రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం నిలధీశారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాజెక్టులు నిర్మించడంతో తెలుగుదేశం గొప్పలు చెప్పుకునేందుకు ఏమి లేకపోవడం, ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ ఉనికి కొల్పోతుందన్న భయంతో చంద్రబాబు పచ్చనాయకులతో తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పడమటి నియోజకవర్గాలకు నీరురాకుండ అడ్డుపడితే తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ ప్రాజెక్టులు ప్రజలకోసమని, దీనిని అడ్డుకుంటే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని , రాబోవు ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, ఇఫ్తికార్, ఇంతియాజ్, గౌస్, లక్ష్మణ్‌రాజు, కిషోర్, శ్రీనివాసులు, రమణ, సూరి, కౌన్సిలర్లు నటరాజ, కిజర్‌ఖాన్, రేష్మా, సాజిదాబేగం, నరసింహులు, మనోహర్, భారతి, జెపి.యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags; We will show Tadakha if fresh water projects are started – Babu effigy burning
