Natyam ad

తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం జెడ్పి ఉన్నత పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీపీ కుసుమకుమారి, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్ గౌడు లు తెలిపారు. సోమవారం వారు రామసముద్రం జెడ్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు, మధ్యాహ్న భోజన పథకం, తాగునీటి సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వండాలని సూచించారు. అలాగే నాడు నేడు లో పాఠశాల భవన నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థుల కోసం కార్పొరేట్ కు ధీటుగా పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.నాణ్యత లో రాజీ పడకుండా పనులను ఫిబ్రవరి చివరి కల్లా పూర్తి చేయాలని సూచించారు. అలాగే పాఠశాలలో తాగునీటి బోరు లో అడ్డంగా చిక్కుకొన్న రాతి పరికరాన్ని ఆర్ డబ్య్లు ఎస్ డి ఈ దృష్టికి తీసుకెళ్లి రాతి ని తొలగించి నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చెర్మెన్ రమ్య, హెచ్ ఎం గాయత్రి, నాయకులు గెవన్న తదితరులు ఉన్నారు.

 

Post Midle

Tags: We will solve the problem of drinking water

Post Midle

Leave A Reply

Your email address will not be published.