పుంగనూరులో దళితుల సమస్యలు పరిష్కరిస్తాం
పుంగనూరు ముచ్చట్లు:
ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశాన్ని తహశీల్ధార్ సీతారామన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఎస్సీ, ఎస్టీల సన్మాసనవాటికలు దురాక్రమణకాకుండ చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా వారికి అందించే అన్ని పథకాలు ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు. సభ్యులు పలు సమస్యలపై చర్చించారు. సమస్యలను అధికారులు నమోదు చేసుకుని వచ్చే సమావేశంలోపు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ మహేష్, ఏవో రాజేశ్వరి, సభ్యులు రాజు, అశోక్, చిన్నప్ప, శ్రీనివాసులు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags: We will solve the problems of Dalits in Punganur
