ముస్లీం ల సమస్యలను తీరుస్తాం
తంబళ్లపల్లిముచ్చట్లు
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద యువనేత నారా లోకేష్తో ముస్లింలు సమావేశం అయ్యారు. అయనకు పలువురు తమ సమస్యలను చెప్పుకున్నారు.
ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ముస్లింల రిజర్వేషన్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..మీరు పోరాడాలి. దుల్హన్ స్కీంకు కఠిన నిబంధనలు పెట్టారు. అర్హులకి అందేలా చూడాలి. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ముస్లిం మహిళలకు ఉపాధి కల్పించాలి. ముస్లిం పిల్లలు పెద్దచదవులు చదవాలంటే హైదరాబాద్, విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ముస్లింలకు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. వైసిపి పాలనలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. మసీదు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు ఇవ్వడం లేదు. ఖబర్ స్తాన్ ల వద్ద కనీసం మౌలిక వసతులు కల్పించడం లేదని అన్నారు.
సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ మైనార్టీల్లో పేదరికం లేకుండా చెయ్యడమే టిడిపి లక్ష్యం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. వక్ఫ్ ఆస్తులు కాపాడటానికి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం. తంబళ్లపల్లె లో తాలిబాన్ పాలన నడుస్తుంది. ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది ఒక్క టీడీపీనే. దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. అధికారంలోకి వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామనిభరోసా ఇచ్చారు.

Tags;
We will solve the problems of Muslims
