We will solve the problems of SC and ST

ఎస్సీ, ఎస్టీ సమస్యలను పరిష్కరిస్తాం

– జెడ్పీమాజీ ఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌

Date:28/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకంటున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు , జెడ్పీమాజీ ఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. శుక్రవారం డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు ఆధ్వర్యంలో మానటరింగ్‌ కమిటి సమావేశాన్ని తహశీల్ధార్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అగ్రస్థానం కల్పించారని కొనియాడారు. వారి సమస్యలను సభ్యుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి నెల క్రమంతప్పకుండ సమావేశాలు నిర్వహించి, అన్ని శాఖల అధికారులు సమావేశాలకు హాజరైయ్యేలా చూడాలన్నారు. పరిష్కారం కానీ సమస్యల జాబితాను సిద్దం చేయాలన్నారు. ఈ జాబితాలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేసి, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సభ్యులు ఎలాంటి సమస్యలు ఎదురైనా సభ్యులు ఆందోళన చెందకుండ ఫిర్యాదు చేస్తే సకాలంలో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌పీవో భారతి, మున్సిపల్‌ మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, ఎక్సెజ్‌ ఎస్‌ఐ పివి.రమణ, ఏఎస్‌ఐ త్యాగరాజుతో పాటు సభ్యులు పాల్గొన్నారు.

పెండింగ్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం

Tags: We will solve the problems of SC and ST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *