పుంగనూరులో నీటి సమస్యను పరిష్కరిస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను మంచినీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం ఆయన డీఈఈ మహేష్‌తో కలసి రీబోర్లు కార్యక్రమాన్ని పరిశీలించారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో బోర్లు రీబోర్‌ చేయాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు గోకుల్‌, రహమత్‌నగర్‌ ప్రాంతాలతో పాటు నాలుగు వార్డులలో మంచినీటి సమస్యను గుర్తించి రీబోర్‌ చేస్తున్నామన్నారు. ప్రజలకు రెండురోజులకొక్కసారి మంచినీటిని సరఫరా చేస్తున్నామని , పూర్తిస్థాయిలో సమస్యలేకుండ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణకుమార్‌, కౌన్సిలర్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We will solve the water problem in Punganur

Leave A Reply

Your email address will not be published.