క్రిష్టియన్ లకు అండగా నిలుస్తాం-పవనన్న ప్రజాబాటలో జనసేన నేత కేతంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్విరామంగా 93 వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెంలోని ఏసన్న వారి వీధిలో బుధవారం జరిగింది.ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను జనసేన నేత కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గుర్తించారు. కనుక్కున్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యధికంగా క్రైస్తవులు నివసిస్తున్నారని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ని తమ ఇంటి బిడ్డగా భావిస్తూ తమను ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. పలువురు తమకు రేషన్ కార్డుల తొలగింపు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల తొలగింపు గురించి తెలిపారని, ప్రతి ఒక్క సమస్యను సంబంధిత వార్డు సచివాలయ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది జనసేన పార్టీనే అని, అందులో ఎలాంటి సందేహాలు లేవని, క్రైస్తవ సోదరులందరూ అండగా నిలవాలని, ప్రతి ఒక్కరికీ తాము అండగా నిలిచి అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: We will stand by Christians- Janasena leader Ketham Reddy on Pawananna Prajabata

Leave A Reply

Your email address will not be published.