భారతీయ జనతాపార్టీని పటిష్టం చేస్తాం

We will strengthen the Bharatiya Janata Party

We will strengthen the Bharatiya Janata Party

Date:10/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారతీయ జనతాపార్టీని పటిష్టం చే స్తామని పార్టీ నియోజకవర్గ నాయకుడు మదన్‌మోహన్‌ తెలిపారు. సోమవారం పట్టణంలో పార్టీ నేతలు గణేష్‌, రాజారెడ్డి, అయూబ్‌ఖాన్‌, విజయభాస్కర్‌, హరిబాబులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో పార్టీని అన్ని విధాల పటిష్ట పరచి, గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు చేపడుతామన్నారు. బిజెపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ముద్దుక్రిష్ణంరాజు, పురుషోత్తం, భక్తవత్సలం లు తిరిగి పార్టీలోకి చేరడం శుభపరిణామమన్నారు. పార్టీని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్కరు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు ఫరుక్‌ఖాన్‌, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఏక్” జూన్ 14 న విడుదల  

 

Tags: We will strengthen the Bharatiya Janata Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *