పుంగనూరులో బిజెపిని పటిష్ట పరుస్తాం
పుంగనూరు ముచ్చట్లు:
భారతీయ జనతాపార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరుస్తామని ఆపార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో భారతీయ జనతాపార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గ కమిటి సభ్యులకు, నూతనంగా నియమింపబడిన పార్టీ ప్రతినిధులకు నియామకపు పత్రాలు అందజేశారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి, చైతన్యవంతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి సురేంద్రరెడ్డి, స్థానిక నాయకులు రాజారెడ్డి, అయూబ్‌ఖాన్, నానబాలకుమార్, రాజాజెట్టి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: We will strengthen the BJP in Punganur
