బిజెపిని పటిష్టం చేస్తాం

Date:23/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల నుంచి భారతీయ జనతాపార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు ఏవి.సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన బిజెపి నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సంస్థాగత ప్రశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, పార్టీని అన్ని విధాల పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. పార్టీ నాయకులందరు సమిష్టిగా బిజెపి సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజారెడ్డి, అయూబ్‌ఖాన్‌, శ్రావణ్‌కుమార్‌, నానబాలకుమార్‌, టివిఎస్‌.ప్రసాద్‌, రాజాజెట్టి, జగన్నాధం, ప్రసాద్‌బాబు, మల్లిక, పురుషోత్తం, గణేష్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీను, మురళి, మణి వెహోదలియార్‌ తదితరులు పాల్గొన్నారు.

సారాతో సహా వ్యక్తి అరెస్ట్

Tags; We will strengthen the BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *