ముస్లింల అభివృద్ధికి అండగా ఉంటాం – ఎంపీ మిధున్‌రెడ్డి
మదనపల్లె ముచ్చట్లు:
ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసేందుకు తమ కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుందని లోక్ సభ ప్యానల్ స్పీకర్ , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే నవాజ్‌బాషా, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ప్ బోర్డు చైర్మన్ అమ్ము, అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం, పుంగనూరు నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి తో కలసి మదనపల్లెలో నమాజ్ చేశారు. అలాగే టిప్పు సుల్తాన్ మసీదుకు రూ. 2 కోట్లరూపాయలతో నిర్మిస్తున్న ప్రహారీ పనులకు భూమిపూజ చేశారు. ముస్లింలు ఎల్లవేళలా వైఎస్సార్‌సీపీకి అండగా నిలివాలని కోరారు.

Tags: We will support the development of Muslims – MP Midhun Reddy
