పుంగనూరులో ఎరుకుల కులస్తుల అభివృద్ధికి అండగా ఉంటాం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ఎరుకుల కులస్తుల అభివృద్ధికి అండగా ఉంటామని పుంగనూరు రూరల మండల ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆంధప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఏడుకొండలు, వై.రామకృష్ణ, ఎం.రామకృష్ణ, ఎం.బాబు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాలెండర్లను ఎంపిపి విడుదల చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనాభా దామాస లెక్కలకు మించి ఎరుకుల కులస్తులకు అనేక ప్రాంతాల్లో ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో కూడ ఎరుకుల కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా తాము పరిష్కరించి, అండగా నిలుస్తామని , ఎరుకుల కులస్తులందరు వైఎస్సార్సిపికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజ, రమణ, క్రిష్ణప్ప, శ్రీకాంత్ , శ్రీనివాసులు, సురేష్, విశ్వనాథ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: We will support the development of the Erukula caste in Punganur – MP Bhaskar Reddy