పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Date:05/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం స్పష్టం చేశారు. పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో ఉన్న మైనార్టీల నాయకుడు బిలాల్‌ అహమ్మద్‌ గత నెలలో మృతి చెందాడు. ఆయన ఇంటికి మంత్రి వెళ్లి బిలాల్‌ కుమారుడు, కుమారైలను చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి , మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి పరామర్శించి ఓదార్చారు. బిలాల్‌ కుటుంభానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఇనాయతుల్లా షరీఫ్‌, అర్షద్‌అలి, ఖాదర్‌బాషా, అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం మంత్రి పెద్దిరెడ్డి చే టీటీడీకి అప్పగింత

Tags: We will support the party workers – Minister Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *