– మంత్రి పెద్దిరెడ్డి
Date:22/09/2019
పుంగనూరు ముచ్చట్లు:
చింతపండు వ్యాపారులకు అన్నివేళలా అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. చింతపండుపై ట్యాక్స్‌ను తొలగించేందుకు ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి చేసిన కృషి ఫలితంగా ట్యాక్స్ రద్దు అయిందని చింతపండు వ్యాపారులు మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేలాది కుటుంబాలు చింతపండును కుటీరపరిశ్రమగా మార్చుకుని జీవిస్తున్నారని, అలాంటి వ్యాపారానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు చింతపండుకు పన్ను తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఇమ్రాన్, సంఘ నేతలు హాఫిజ్, ఎంఎస్.సలీం, చాంద్‌బాషా, ఖాదర్, ఎస్కెపి.ఖాజా, కిజర్‌ఖాన్, అమ్ము , అఫ్సర్, రహంతుల్లా, రఫిక్, రామలింగప్ప, జిఆర్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags: We will support the tamarind merchant