వేమనారాయణ కుటుంభాన్ని ఆదుకుంటాం-జిల్లా అటవీశాఖాధికారి రవిశంకర్
బి.కొత్తకోట ముచ్చట్లు:
గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హార్సిహిల్స్ అటవీశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి వేమనారాయణ కుటుంభాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటామని జిల్లా అటవీశాఖాధికారి రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని రామాపురం వెళ్లి వేమనారాయణకుటుంభాన్ని పరామర్శించారు. భార్య శాంతమ్మ , కుమారైలతో మాట్లాడారు. ప్రమాదంలో వేమనారాయణ మృతి చెందడం బాధకరమని అన్నారు. కటుంభాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునే అవకాశం లేదని చెప్పారు. అటవీశాఖ సిబ్బంది ద్వారా ఆర్థిక సహాయం అందించి , ఆదుకుంటామని ఆయన చెప్పారు. పాతికేళ్లు అటవీశాఖకు వేమనారాయణ సేవలు అందించారని కొనియాడారు. ఆయన వెంట మదనపల్లె రేంజర్ బాలకృష్ణారెడ్డి, సెక్షన్ ఆఫీసర్ శికుమార్, బీటు అధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: We will support the Vemanarayana family – District Forest Officer Ravi Shankar