మత విద్వేషాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

-తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు

Date:15/01/2021

తిరుపతి ముచ్చట్లు:

జిల్లాలో దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తిస్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి.దేవాలయాలు, ప్రార్థన మందిరాలలో తరచుగా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తున్నాం.మత విద్వేషాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు తెలిపారు.తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి. ఎ.రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని దేవాలయాలు/ప్రార్థన మందిరాల రక్షణ విషయములో తీసుకున్న నిర్ణాయాల గురించి తిరుమల/నేర విభాగము అడిషనల్ యస్. పి. మునిరామయ్య, లా అండ్ ఆర్డర్ అడిషనల్ యస్. పి. ఆరిఫుల్లా శుక్రవారం పత్రికా ముఖంగా సమాచారాన్ని తెలియజేసారు. జిల్లా వ్యాప్తంగా 608 సున్నితమైన ప్రాంతాలను గుర్తించడం జరిగినది. అందులో, 463 దేవాలయాలలో 1352 CC కెమెరాలు,75 మసీదులలో 148 CC కెమెరాలు,70 చర్చిలలో 124 CC కెమెరాలు
మొత్తము 608 ప్రార్థన స్థలాలలో 1624 CC కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగినది. రెగ్యులర్ బీట్లలో ఆర్గనైజడ్ టెంపుల్ బీట్లు గా మార్చి నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.సున్నితమైన, పైన పెర్కొనబడినవే కాకుండా, జిల్లా ఎండోమెంట్, TTD వారి సహాకారంతో మరియు లోకల్ స్థానిక ప్రజలు, పూజారులు, ఫాస్టర్లు, ఇమాముల సహాకారంతో ఇతర ఆలయాలు 608 ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేకంగా CC కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను రక్షణగా ఏర్పాటు చేస్తున్నాం.

 

 

వీటితో పాటు కమిటీలు, గ్రామ పరిరక్షణ బృందం కుడా విధి నిర్వహణలో ఉంటుంది. తిరుపతి అర్బన్ జిల్లా యస్. పి. వారి అధ్వర్యంలో పోలీస్ శాఖ యందు నూతనంగా త్రినేత్ర యాప్ ను కనిపెట్టి సున్నితమైన మరియు ముఖ్యమైన దేవాలయాలు/ప్రార్థన స్థలాల వద్ద GEO Tag చేసి పోలీస్ అధికారులచే నిరంతర పర్యవేక్షణ మరియు నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.దేవాలయాలు/ప్రార్థన స్థలాల రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా జిల్లాలో 169 కేసులు నమోదు చేసి 729 మందిని (DCs, Rowdies, Suspects మరియు ఇతరులను) ముందు జాగ్రత్త చర్యగా bind over చేసుకోవడం జరిగినది. ఇల్లటి కార్యక్రమాలు నిరంతరం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ప్రతి దేవాలయానికి, ప్రార్థన స్థలానికి సంబందించి అనంతపురము రేంజ్ DIG మరియు జిల్లా యస్. పి. వారి ఆదేశాల మేరకు సంబందిత ఆలయాల అధికారులు కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యెక సెక్యూరిటీ ఆడిట్ జరుగుతూ ఉన్నది.
దేవాలయాలు/ప్రార్థన మందిరాల రక్షణ విషయములో తిరుపతి అర్బన్ జిల్లా పోలిస్ యంత్రాంగం అప్రమత్తమై 24 X 7 నిఘా ఉంచడమైనది.

 

 

ముఖ్యంగా జిల్లా ప్రజలు ఈ సున్నితమైన విషయముపై మంచి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాము.రాష్ట్రంలో ఇటివలి కాలంలో జరుగుతున్న కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జిల్లాలో జరగకుండా, పునరావృత్తం కాకుండా ఉండే విధంగా జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహణ జరుగుచున్నది. జిల్లాలో ఉన్న పోలీసు అధికారులందరికి దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశాలు జారీ చేయడం జరిగినది.

 

 

 

జిల్లాలో దేవాలయాలు/ప్రార్థన మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, మత సంబంధమైన వివాదములు కలగకుండా నిరోధించే విధంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశామని, మత విద్వేషాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా తమ చుట్టు ప్రక్కల ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, శాంతి భద్రతల విఘాతం కల్గించే విషయాలు గమనించిన డయల్ 100 కు గాని, పోలీసు Whatsappనెం. 80999 99977 కు గాని తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరములు పూర్తి గోప్యంగా ఉంచబడునని అర్బన్ జిల్లా పోలీసులు తెలిపారు.

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags: We will take strict action against those who cause religious hatred and disturb the peace.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *