పుంగనూరులో సమస్యలు లేని గ్రామాలుగా మార్చుతాం- ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు సమస్యలు లేని గ్రామాలుగా మార్పు చేసేందుకు శక్తి వంచన లేకుండ ప్రతి ఒక్కరు కృషి చేయడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం తొలిరోజు కార్యక్రమాన్ని పిచ్చిగుండ్లపల్లె, మిట్టపల్లె, కొండసముద్రం గ్రామాల్లో డ్వామాపీడీ చంద్రశేఖర్‌, మంత్రి పీఏ చంద్రహాస్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగ రాజారెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యలను ప్రజల ఇంటి వద్ద పరిష్కరించడం జరుగుతోందన్నారు. అలాగే గ్రామాల్లో నీరు, వీధులు, కాలువల తో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో లక్షలాది రూపాయలు పేదలకు అందడంతో పేదలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, జయరామిడ్డి, నాగభూషణ్‌రెడ్డి, రాగానిపల్లె బాబు, పాపిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, సుబ్రమణ్యం, వెంకటరెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: We will turn Punganur into problem-free villages – MPP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.