Natyam ad

శిథిలావస్థలో ఉన్న భవనాల పనులు చేపడతాం

ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్ పొకల రామకృష్ణారెడ్డి

బద్వేలు ముచ్చట్లు:

కడప జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ టూరిజం ఉన్న శిథిలావస్థలో విశ్రాంతిభవనాలు పార్కులను పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశీలన చేపట్టడం జరిగిందని ఏపీ టూరిజం డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి, పేర్కొన్నారు  ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పవిత్రమైన బ్రహ్మంగారిమఠంలో ఏపీ టూరిజం శిథిలావస్థలో ఉన్న భవనాలను తిరిగి ప్రారంభోత్సవానికి నోచుకునే విధంగా ఏపీ టూరిజం శాఖ ఎండి,, చైర్మన్ బోర్డు మీటింగ్ చర్చించడం జరిగిందని  వారు కూడా స్పందించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్న భవనాలను పార్కులలో పరిశీలన చేయమని ఆదేశాలు ఇచ్చారని తిరిగి నేర్చుకున్న విధంగా చూస్తామని వారు తెలిపారు అందులో భాగంగానే బ్రహ్మంగారిమఠంలో ఏపీ హరిత టూరిజం అతిథి గెస్ట్ హౌస్, బ్రహ్మ సాగర్ వద్ద ఉన్న పార్కు సాగర్ లో బోట్ షికారును ప్రారంభించిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఏపీ టూరిజం శాఖ మంత్రులు ఆర్కే రోజా అశాఖ ఎండి చైర్మన్,

 

 

 

Post Midle

బోర్డు మీటింగ్ ద్వారాచర్చించడం వారు తెలిపారు ఈ జిల్లా వాసిగా పుణ్యక్షేత్రమైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం భూత భవిష్యత్ కర్త కాలాన్ని జరిగింది జరగబోయేది భక్తులకు తెలియజేసిన కాలజ్ఞాని ఆయన మఠం టూరిజం పనులు ప్రారంభించే విధంగా చూస్తామని రాబోయే రోజుల్లో పనులు మా టూరిజం శాఖకు దేవదాయ శాఖ కూడా సహాయ సహకారాలు అందించాలని లక్ష్యంతోనే ముందుకు పోతామన్నారు త్వరలో పనులను చేపడతామని పూర్తయినంక మళ్లీ ప్రెస్ మీట్ పెడతామని ఆయన తెలిపారు. అదేవిధంగా గంగానది హరిద్వార్ లాగా బ్రహ్మ సాగర్ లో కూడా గంగ హారతి ఉదయం లేదా సాయంత్రం ఇచ్చే విధంగా టూరిజం ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవిధంగా ఆయన తెలిపారు. అనంతరం బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ప్రత్యేక స్వాగతం పలికి బ్రహ్మంగారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.  పూలమాలతో సత్కరించారు. అనంతరం బ్రహ్మ సాగర్ పరిశీలన చేపట్టారు, కార్యక్రమంలో బి యస్ నారాయణరెడ్డి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సంఘ సేవకులు, కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We will undertake the work of dilapidated buildings

Post Midle