పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేర్నాటిని గెలిపించుకుంటాం
-మద్దతు ప్రకటించిన పిఆర్టియు జిల్లా శాఖ
నెల్లూరు ముచ్చట్లు:
పట్టభద్రుల ఎన్నికల్లో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికే పి ఆర్ టి యు పూర్తి మద్దతు ఉంటుందని ఆయన విజయానికి కృషి చేస్తామని పి ఆర్ టి యు నెల్లూరు జిల్లా శాఖ తమ మద్దతును ప్రకటించింది. స్థానికంగా జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పి ఆర్ టి యు ముఖ్య నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంసుందర్ రెడ్డి కే తమ పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు జి ఎన్ టి రోడ్డు నందు గల కిలారి వెంకటస్వామి నాయుడు కళ్యాణ మండపంలో జరిగిన పి ఆర్ టి యు కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పిఆర్టియు ముఖ్య నేతలు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం గురించి చర్చించడం జరిగిందని, మనందరి గళాన్ని శాసన మండలిలో బలంగా వినిపించేందుకు మన ప్రతినిధులుగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నేతలు తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు పి ఆర్ టి యు మద్దతు మాకు ఉందని బయట ప్రచారం చేసుకుంటున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని, దీనిని పిఆర్టియు తరపున ఖండిస్తున్నామ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, చంద్రశేఖర్ రెడ్డికి మాత్రమే మా మద్దతు అని, తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో పి ఆర్ టి యు నేతలు మద్దతిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలని, ఉపాధ్యాయుల సమస్యలను నిరుద్యోగ సమస్యలను భగవంతుని దయతో మీ అందరి ఆశీస్సులతో ఒక అవకాశం కల్పించి శాసనమండలికి పంపిస్తే ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు, నిరుద్యోగ యువకులకు వారధిగా ఉంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags; We will win Pernati in MLC elections for graduates
