Natyam ad

పెద్దిరెడ్డి కుటుంబం విజయానికి కృషి చేస్తాం

– అగ్రీడీలర్ల సమావేశంలో నిర్ణయం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రీ డీలర్ల సమావేశం ఆదివారం మండలంలోని ఈడిగపల్లె వద్ద గల భీమినేని రెస్టారెంట్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు విజయరెడ్డి ఆధ్వర్యంలో 120 మంది డీలర్లు సమావేశమై ఏకగ్రీవంగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తు పై వేయించాలని కోరారు. ఈ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో డీలర్ల సమస్యలు ఎన్నో పరిష్కారమైందన్నారు. కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జిల్లాలోని డీలర్లు కూడ మద్దతు ఇవ్వాలని కోరామన్నారు. డీలర్లు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించినందుకు డీలర్లకు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల నాయకుడు రామకృష్ణారెడ్డి, డీలర్లు భవానిశ్రీనివాస్‌, జనార్ధన్‌రెడ్డి, శివ, కృష్ణారెడ్డి, కుమార్‌, కిషోర్‌, దామోదర్‌రెడ్డి, హరి, శంకర్‌నారాయణ, ప్రతాప్‌, బాబురెడ్డి, బాలాజిశీను తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We will work hard for the success of the Peddireddy family

Post Midle