Natyam ad

కాపుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాం

చౌడేపల్లి ముచ్చట్లు:

కాపుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు .ఆదివారం తిరుపతిలోని మంత్రి స్వగృహంలో యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ బాబు ,నూతనంగా నియమితులైన కాపునాడు రాష్ట్ర కార్యదర్శి చౌడేపల్లి కి చెందిన అండే రాజన్న తో కలిసి మర్యాదపూర్వకంగా మంత్రికి పుష్పగుచ్చమిచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి, కు ఎంపీ మిథున్ రెడ్డి ,కు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారక నాథ రెడ్డి ,కు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం ,రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిం టికిషోర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు .కాపుల శ్రేయస్సు కోసం నిర్విరామంగా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల రాము ,పూల గణేష్ తదితరులు ఉన్నారు.

 

Post Midle

Tags: We will work tirelessly for the development of Kapula

Post Midle