పుంగనూరులో చెత్తనుంచి సంపద తయారీ – డీపీవో దశరథరామిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని చెత్తను సేకరించి వాటి ద్వారా ఎరువులు తయారు చేసి చెత్తనుంచి సంపదను తయారు చేయాలని డీపీవో దశరథరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఆరడిగుంటలో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. డీపీవో మాట్లాడుతూ చెత్తను సేకరించి ఒక చోటకు తరలించి, వానపాములతో ఎరువుల తయారీని చేపట్టి రైతులకు సరసమైన ధరలకు విక్రయిస్తామని తెలిపారు. సేంద్రీయ ఎరువులతో పంటల దిగుబడి అధికంగా ఉంటుందని తెలిపారు.దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డి కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్‌రావు, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Wealth creation from garbage in Punganur – DPVO Dasaratha Ramireddy

Leave A Reply

Your email address will not be published.