నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో ఆయుధ‌పూజ‌

Date:30/10/2020

తిరుమల  ముచ్చట్లు:

తిరుమ‌ల‌లోని టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో శుక్ర‌వారం ఆయుధ‌పూజ ఘ‌నంగా జ‌రిగింది. తిరుమ‌ల ఫ్లోర్ మిల్ ప్రాంగ‌ణంలో గ‌ల విజిలెన్స్ స్టోర్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.   ముందుగా అర్చ‌కులు శ్రీ‌వారు, దుర్గామాత చిత్ర‌ప‌టాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈవో, సివిఎస్వో క‌లిసి అయుధాలు, ఇత‌ర భ‌ద్ర‌తా ప‌రిక‌రాల‌కు ఆయుధ‌పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌గా ఏర్పాటుచేసిన భ‌ద్ర‌తా ప‌రిక‌రాల ప‌నితీరును అద‌న‌పు ఈవోకు భ‌ద్ర‌తా సిబ్బంది వివ‌రించారు.

 

 

ఈ సంద‌ర్భంగా టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలోని ఆయుధ‌సామ‌గ్రికి, ప‌రిక‌రాలకు ఆయుధ‌పూజ చేసిన‌ట్టు తెలిపారు. ఇందులో ప్ర‌ధానంగా బాంబుల నిర్వీర్యానికి, అగ్నిప్ర‌మాదాల నివార‌ణ‌కు‌, క‌మ్యూనికేష‌న్‌కు సంబంధించిన‌ ప‌రిక‌రాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో దాదాపు 2800 మంది సిబ్బంది ఉన్నార‌ని, భ‌క్తుల భ‌ద్ర‌త కోసం వీరు ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉంటూ భ‌ద్ర‌త ప‌రంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారని చెప్పారు. భ‌ద్ర‌తా సిబ్బందికి ఆయురారోగ్యాలు ప్ర‌సాదించి, చ‌క్క‌గా విధులు నిర్వ‌హించేలా చూడాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆయుధ‌పూజ నిర్వ‌హించిన‌ట్టు తెలియ‌జేశారు.

వకీల్ సాబ్ షూటింగ్ కోసం ప్రిపేర్

Tags: Weapon worship in the Department of Surveillance and Security

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *