హెల్మెట్ , సీట్ బెల్టులు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి-జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్
-స్పెషల్ డ్రైవ్ లో 357 కేసులు
కడప క్రైం ముచ్చట్లు:
హెల్మెట్ , సీటు బెల్టు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. హెల్మెట్ , సీటు బెల్టు ధరించడం వల్ల విలువైన ప్రాణాలను సురక్షితం గా ఉంచుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ పై పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రామాల సందర్శన సమయంలో నిర్వహించే గ్రామ సభల్లో ఫ్యాక్షన్, మట్కా, సైబర్ నేరాలు తదితర అంశాలుతో పాటు రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు జిల్లా ఎస్.పి తెలిపారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పక్కాగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి… కార్లు, జీపులు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్టు వేసుకోవాలని ఎస్.పి తెలిపారు. వేగ నియంత్రణ… మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు… మొబైల్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకుండా జాగ్రత్తలు…ఓవర్ లోడింగ్ తో వెళ్లే ఆటోలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత పై స్టిక్కర్లు, పోస్టర్లు ముద్రించి పట్టణాలతో పాటు గ్రామాల్లో అతికిస్తూ ప్రజల్లో అవగాహన తెస్తున్నామన్నారు.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందన్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడుతున్నాయని గుర్తించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రహదారి భద్రత వారోత్సవాల నేపథ్యంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్.పి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నిరయంత్రణకు అందరూ తమ వంతు సామాజిక బాధ్యతగా భావించి కృషి చేయాలని జిల్లా ఎస్.పి విజ్ఞప్తి చేశారు.శుక్రవారం స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 357 కేసులు … ఇందులో హెల్మెట్ లేని కేసులు 327, సీట్ బెల్ట్ ధరించని వారిపై 30 కేసులుజిల్లాలో పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై మొత్తం 357 కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 327 కేసులు, సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు, జీపులు, తదితర వాహన చోదకులు 30 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు.
Tags: Wear helmet, seat belts to save lives-District SP KKN Anburajan
