కట్నంగా మోటారుసైకిల్ తీసుకురాలేదని భార్యను నగ్నంగా మార్చి…

Wearing the wife naked as he did not bring a motorcycle into a dumb ...

Wearing the wife naked as he did not bring a motorcycle into a dumb ...

Date:14/07/2018

ఫిరోజాబాద్ ముచ్చట్లు:

పుట్టింటి నుంచి కట్నం కింద మోటారు సైకిలు తీసుకురాలేదని భార్యను నగ్నంగా మార్చి కాలుతున్న గరిటతో వాతలు పెట్టిన కసాయి భర్త బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. గడిబహు గ్రామానికి చెందిన రవి కుషాల్ పూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం కట్నంగా పుట్టింటి నుంచి మోటారుసైకిలు తీసుకురాలేదని భర్త రవి అతని సోదరులు రాము, భోలా, సోదరీమణులు అంజూ, మంజూ, బావమరుదులు సుభాష్, ఒస్పాల్ లు కలిసి భార్య బట్టలు ఊడదీసి మంచానికి కట్టేసి గరిటను కాల్చి కడుపు, పెదాల వద్ద వాతలు పెట్టారు. అత్తింటి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తన పుట్టింటికి చేరి భర్త రవితోపాటు అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు బాధిత యువతికి వైద్యపరీక్షలు చేయించి నిందితులపై ఐపీసీ సెక్షన్ 489 ఏ, 323 ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి సంజయ్ వర్మ చెప్పారు.

కట్నంగా మోటారుసైకిల్ తీసుకురాలేదని భార్యను నగ్నంగా మార్చి…

Tags:Wearing the wife naked as he did not bring a motorcycle into a dumb …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *