రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

Date:25/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఉత్తర గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ దాని పరిసర ప్రాంతాలలో 5.8కిమీ  ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒరిస్సా తీర ప్రాంతాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఈరోజు (ఆగస్టు 25 న) ఉదయం అల్పపీడనం ఏర్పడింది.
దీనికి అనుబంధముగా 5.8 కిమీ  ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటలలో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. రాయలసీమ దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో  7.6 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ లో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్ర లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు కోస్తాఆంధ్రాలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కోస్తాఆంధ్రాలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు  ఎల్లుండి కోస్తాఆంధ్రాలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు.
రాయలసీమలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు  రాయలసీమలో ఈరోజు రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Tags: Weather forecast for up to three days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *