రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

Weather forecast for up to three days

Weather forecast for up to three days

Date:13/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా7.5 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర చత్తీస్ గఢ్  దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  దీని ప్రభావంతో తెలంగాణ లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు  తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ  వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పచ్చిమగోదావరి మరియు కృష్ణ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ  వర్షాలతో పాటు  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు  కోస్తా ఆంధ్రలో  చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు   ఎల్లుండి  కోస్తా ఆంధ్రలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ లో  తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాయలసీమలో ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ  కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన https://www.telugumuchatlu.com/weather-forecast-for-up-to-three-days-3/
Tags:Weather forecast for up to three days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *