Natyam ad

చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి -నేతన్నలను ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర బాబు

నెల్లూరు ముచ్చట్లు:
.

నెల్లూరు  నగరంలోని కస్తూరి దేవి బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను జిల్లా ప్రజలందరూ సందర్శించి, విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కళాకారుల వృత్తి, నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని  కస్తూర్బా బాలికల విద్యాలయం (రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్)లో నాబార్డు సహకారంతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ దుకాణాలను కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 30 చేనేత వస్త్రాల విక్రయ స్టాళ్లతో కస్తూరి దేవి బాలికల విద్యాలయంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పేరెన్నికగల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం సంతోషకర విషయం అన్నారు. ప్రాచీన కళలు మరుగున పడిపోకుండా, చేనేత కార్మికులకు అండగా, వారి శ్రమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను ప్రజలందరూ కొనుగోలు చేయాలని కోరారు. సుమారు 300 గంటలపాటు మగ్గం మీద కార్మికుడు శ్రమిస్తే ఒక చీర తయారవుతుందని, అదే పవర్ హ్యాండ్లూమ్స్ మిషన్ల ద్వారా 3 నిమిషాల్లో తయారయ్యే చీర ఎక్కువ కాలం మన్నిక ఉండదని, అదే మగ్గం మీద నేసిన చీర ఎంతో నాణ్యంగా ఉంటుందని, నేతన్న కష్టానికి ప్రజలంతా తమ సహకారం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నారు.ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని అధికారులంతా తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించి రావాలన్నారు.

 

 

నగర మేయర్ స్రవంతి మాట్లాడుతూ మనదేశంలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రతి ఒక్కరు కూడా చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలుత పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి కస్తూర్బా బాలికల హైస్కూల్ వరకు చేనేత కార్మికులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు.కెనరా బ్యాంకు సహకారంతో చేనేత కార్మికులకు రుణాలు పంపిణీ.ఈ సందర్భంగా కెనరా బ్యాంకు సహకారంతో ఏఎస్ పేట, కావలి ఎడవల్లి, సౌత్ మోపూరు గ్రామాలకు చెందిన చేనేత కార్మికులకు ముద్రా పథకం కింద కోటి రూపాయల రుణాలను అందించారు. ఏఎస్ పేట లోని 175 మంది చేనేత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో ముద్ర రుణాలను అందించినట్లు ఎల్డిఎం   శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నారాయణ రెడ్డి పేట గ్రామంలోని చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, నగరపాలక సంస్థ కమిషనర్  హరిత, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్  శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, చేనేత, జౌళి శాఖ ఏడి శ్రీ ఆనంద్ కుమార్,  నాబార్డు డిజిఎం కెవిఎస్ ప్రసాద్, డి ఆర్ ఎం మణిశేఖర్, డిడిఎం రవిసింగ్, ఏపీజీబీ ఆర్ఎం శైలంద్రనాథ్, జడ్పీ సీఈవో వాణి, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్  ఆదిలక్ష్మి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు  గుత్తికొండ శ్రీనివాసులు, జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా పార్లమెంట్ కన్వీనర్  దోనేపూడి కోటేశ్వరరావు, తొగట కార్పొరేషన్ డైరెక్టర్  రమణయ్య, మాజీ ఎమ్మెల్సీ  బూదాటి రాదయ్య, చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Weavers should be encouraged to buy handloom cloths – District Collector KVN Chakradhara Babu

Post Midle

Leave A Reply

Your email address will not be published.