పోలీసులకు వీక్లీ పరేడ్
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోం గార్డ్ సిబ్బందికి ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ లో మెదక్ డి.ఎస్.పి సైదులు పాల్గొన్నారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు , సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని అన్నారు. మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్ నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న చెప్పవచ్చు అన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఏ కార్యక్రమంలో జిల్లా సి.ఐలు,ఎస్.ఐ.లు,ఆర్.ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Weekly parade for police

