పలు దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ దాడులు
ఏలూరు ముచ్చట్లు:
కైకలూరు నియోజకవర్గంలో మంగళవారం నాడు తూనికలు, కొలతల శాఖ అధికారులు పలు దుకాణానాలలో దాడులు నిర్వహించారు. కలిదిండి గురవాయపాలెం.. చుట్టుపక్కల గ్రామాలలో తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. చికెన్ , మటన్ , కూరగాయల షాపు దుకాణాల్లో తూనికల్లో వ్యత్యాసాలు ఉండటంవల్ల లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసి కాటాలు సీజ్ చేయడం జరిగింది.
Tags: Weights and Measures department raids many shops

