పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన జయప్రదం చేయండి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు పర్యటనను జయప్రదం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. బుధవారం మండల కార్యాలయంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అలాగే జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి మండల కార్యాలయాన్ని పరిశీలించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పుంగనూరు మండల కార్యాలయాన్ని రూ.2.60 కోట్లతో అత్యంత సుందరంగా నిర్మించడం జరిగిందన్నారు. ఈభవనాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ పట్టణంలోని శాంతినగర్‌లో విద్యుత్‌లైన్లు మార్పిడి కార్యక్రమం పనులను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే రాగానిపల్లె రోడ్డు, తూర్పువెహోగశాలలో రూ.1.60 కోట్లతో నిర్మించిన రెండు అర్భన్ హెల్త్ సెంటర్లను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నరసింహులు, రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags; Welcome Minister Peddireddy’s visit to Punganur – MPP Bhaskar Reddy
