తుమ్మలకు ఘన స్వాగతం
ఖమ్మం ముచ్చట్లు:
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం చేరుకున్నారు. అయన తుమ్మల అభిమానులు, అనుచరుగణం ఘనంగా స్వాగతం పలికారు. జై తుమ్మల అంటూ నినాదాలు చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల వర్గం నేతలు భారీగి తరలివచ్చారు. పాలేరు టికెట్ దక్కకపోవడంతో తుమ్మల అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాలోకి శుక్రవారం అయన వచ్చారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు వర్గం మహా ర్యాలీ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. మహా ర్యాలీ ద్వారా తుమ్మల బలం, బలగాన్ని చూపాలని ఆయన వర్గం నేతలు పట్టుదలతో ఉన్నారు. పాలేరు నుంచి కచ్చితంగా పోటీలో ఉండాల్సిందేనని అవసరమైతే బీఆర్ఎస్ కు గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్, లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ను అభిమానులు అనుచరులు కోరినట్లు సమాచారం.
Tags: Welcome sneezes

