Welfare benefits for all eligible

అర్హులందరికి సంక్షేమ ఫలాలు

Date:01/08/2020

రామసముద్రం ముచ్చట్లు:

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీటీసీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి, నాయకులు దిగువపల్లి శ్రీనివాసులరెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక కెసిపల్లె సచివాలయంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్దిపొందుతున్న పింఛన్ దారులకు ఒక్కొక్కరికి రూ.2250లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమానికే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్న ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న 10రోజుల్లోనే పింఛన్లు మంజూరు అవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా ఆదేశాల మేరకు సమస్యలను గుర్తించి అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, బాబు, వాలింటర్లు మేఘన, రేవతి, రామచంద్ర, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

బక్రీద్ పండగ ఇబ్రహీం త్యాగ నిరథికి, ప్రేమకు, ప్రతీక

Tags: Welfare benefits for all eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *