Natyam ad

సంక్షేమ సారధి జగన్‌మోహన్‌రెడ్డి – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను గుర్తించి , వారిని అభివృద్ధి చేసేందుకు నవరత్నాలను ప్రవేశపెట్టి , సంక్షేమ సారధిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. బుధవారం గడప గడపకు రెండవ రోజు కార్యక్రమాన్ని మంత్రి పీఏ చంద్రహాస్‌, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మేలుందొడ్డి, గోపిశెట్టిపల్లె, కొత్తూరు గ్రామాల్లో నిర్వహించారు. సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు అందాయా లేదా అంటు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు తాము బాగున్నామని , ఇలాంటి ముఖ్యమంత్రి చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించి ఆదర్శంగా పని చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా ప్రజల సమస్యలు ఇంటి వద్దనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజారెడ్డి, శంకరప్ప, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నంజుడప్ప, రెడ్డెప్ప, రామకృష్ణారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Welfare Chief Jagan Mohan Reddy – MPP Akkisani Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.