సంక్షేమం అంటే డబ్బు ఇవ్వడం కాదు

విజయనగరం ముచ్చట్లు :

 

కాశ్మిర్ కి నెహ్రు ….ప్రత్యేక హక్కులి కల్పించటం వలనే బీజేపీ ఏర్పడింది. నెహ్రూ  విధానాలను వ్యతిరేకిస్తూ క్యాబినెట్ నుండి బయటకు వచ్చిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. దేశంలో రెండు జెండాలు అనే విధానాలను వ్యతిరేకిస్తూ నెహ్రు పోకడలను తిప్పి కొట్టిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ అని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.భారతదేశంలో కాశ్మిర్ విలీనం కావాలని పట్టుబడిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్. కాశ్మిర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. టూరిజం గా అభివృద్ధి చేశాం. గత రెండేళ్లలో 300 కోట్లతో ఎన్. ఆర్.జి.ఎస్.పథకం లో భాగంగా 300 కోట్లతో ఏపీలో మొక్కలు నాటామని అన్నారు.
ప్రస్తుతం ఒక్క మొక్క కూడా కనబడలేదు. ప్రభుత్వ పరిపాలన విధానంలో పోకడలను  మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత మేరకు అప్పులి చేయాలి, ఎంత మేరకు ఖర్చు పెట్టాలో ఆలోచన చేయాలని అన్నారు.

 

 

 

 

వస్తువును కొనకూడదు, మనమే తయారు చేసి విదేశాలకు అమ్మాలి అనే విధంగా మోడీ పాలన చేస్తున్నారు. సంక్షేమం అంటే డబ్బు ఇవ్వడం కాదు. ఓట్ల కోసమే పాలన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేద వాళ్ళకి అనేక కార్యక్రమాలును ప్రవేశ పెడితే ఏపీ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసింది. విభజన భాగంలో విడిపోయి ఏపీ నస్తపోయిందని అన్నారు.
ఉద్యోగాలు కల్పించే ఇండస్ట్రీకి స్థాపనకు డబ్బులు లేవు అంటాడు. కేంద్ర సహకరం చేస్తుందని చెప్పినా దానికి సహకరించలేదు. కోవిడ్లో  వ్యవహరించిన తీరు అన్యాయం. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.  మద్యం విషయంలో 20 కొంటున్నారు 300 లకు అమ్ముతున్నారు. విభజన హామీల విషయంలో  చర్చలకు బీజేపీ సిద్ధం,ఏపీ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదంటూ ప్రచారం చేస్తోంది.మోడీ ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందో వారికే తెలియజేస్తాం. కృష్ణ, గోదావరి వాటర్ విషయంలో తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారని అన్నారు.

 

 

 

 

పోలవరం ముంపు మండలాల కోసం బీజేపీ పోరాటం చేసింది. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ వాల్లే ఇరిగేషన్ మంత్రులు గా ఉన్నారు. ఆనాడు ఏపీని తాకట్టు  పెట్టారు,తద్వారా అనేక విధాలుగా  నష్టపోయాం. తెలంగాణ విడిపోయి కూడా ఆంధ్రులను శత్రువులు గా చూస్తున్నారు. వాటర్ మీద ఆలోచన చేసేందుకు క్యాబినెట్ ర్యాన్క్ తో కుడికొని ఆఫీసర్ తో  ఉన్న వాటర్ బోర్డును వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తోటపల్లి,వంశధార ప్రాజెక్టులు అసంపూర్తిగా ఎందుకు నిలిచాయి.దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడారు. పోలవరం మాదిరిగానే ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులో త్వరగతిన ఎందుకు నిర్మాణం చేయరని ప్రశ్నిస్తున్నామని అయన అన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Welfare does not mean giving money

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *