అర్హులందరికీ సంక్షేమ ఫలాలు-జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు
కడప ముచ్చట్లు:
అర్హులై ఉండి పలు కారణాలతో.. సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన ముఖ్యమంత్రి జిల్లాలో పలు పథకాలకు సంబంధించి.. 18,018 మంది లబ్దిదారులకు రూ.9.87 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చే లక్ష్యంతో.. ప్రజలకు సంతృప్త స్థాయిలో ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని.. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు తెలియజేసారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి… అర్హులై ఉండి పలు కారణాలతో.. సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విసి ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు తోపాటు కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జేసీ సాయికాంత్ వర్మ, అడా చైర్మన్ గురుమోహన్ లు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి విసి ముగిసిన అనంతరం.. జిల్లాలో అర్హులై ఉండి పలు కారణాలతో.. సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన 18,018 మందికి మంజూరైన మొత్తం రూ.9,87,00,000 లను మెగా చెక్కును.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో కూడా సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా.. అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. అర్హులై ఉండి పలు కారణాలతో.. సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారికి ప్రభుత్వం ద్వారా.. లబ్ది చేకూరడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 18018 మంది లబ్దిదారులకు.. రూ.9,87,00,000 ల మొత్తం మంజూరైందన్నారు.
Tags: Welfare fruits for all deserving-District Collector V.Vijayaramaraju