సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆశయం

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆశయమని , ఇది ప్రజల ప్రభుత్వమని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం తేరువీధి సచివాలయ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో పార్టీ జెండాలు ఎగురవేశారు. మా నమ్మకం నువ్వేజగన్‌ బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల ఆధ్వర్యంలో పుంగనూరులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు, పెన్షన్లు, రేషన్‌కార్డులు, తదితర నవరత్నాలను అందజేశామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను 99 శాతం అమలు చేసి , ఓట్లు అడుగుతున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ పాలన సువర్ణ అక్షరాలతో లికించదగ్గదని ప్రశంసించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కొండవీటి గంగులమ్మ, కన్వీనర్‌ వరదారెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Post Midle

మండలంలో…

మండలంలోని సుగాలిమిట్ట సచివాలయ పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని గురువారం ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి నిర్వహించారు. సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డితో కలసి డిజిటల్‌ బోర్డులు ఆవిష్కరించి, గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాలు ఎగురవేశారు. మానమ్మకం నువ్వే జగన్‌ బుక్‌లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, రాజునాయక్‌, ప్రభాకర్‌నాయక్‌, శ్రీనివాసులునాయక్‌, వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Welfare is the ambition of YSRCP government

 

Post Midle