Welfare is the government's mission

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Date:02/07/2020

రామసముద్రం ముచ్చట్లు:

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కేసిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సచివాలయంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులను లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న త్వరిగతిన అందజేస్తున్నట్లు తెలిపారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా 9మందికి కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీనివాసులు, సర్వేయర్ రేణుక, బాబు, సచివాలయ సిబ్బంది, వాలింటర్లు దినకర్, కుమార్ స్వామి, వెంకటరమణ, రెడ్డెమ్మ, పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.

ఐదు టన్నుల వేరుశెనగ పప్పు విరాళం

Tags: Welfare is the government’s mission

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *