Natyam ad

సంక్షేమమే …. ప్రభుత్వ పథం

చౌడేపల్లె ముచ్చట్లు:


సంక్షేమమే తమ పథమని, మూడేళ్లలో చేసిన అభివృద్దిని తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట మీ ఇంటికి వస్తున్నామని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు అన్నారు. శనివారం మండలంలోని పెద్దయల్లకుంట్ల,చెడుగుట్లపల్లె,ఠాణా కొత్తయిండ్లు,రాచవారిపల్లె, ఊటూరు, చిప్పిలివారిపల్లె తదితర గ్రామాల్లోని 314 ఇండ్లును సందర్శించి, గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఇంటికి ఇంటికీ వెళ్లి ప్రభుత్వమ అందిస్తున్న పథకాల ద్వారా కలిగిన లబ్దిని ప్రజలకు వివరించారు. ప్రజలు చెబుతున్న సమస్యలను వింటూ అక్కడిక్కడే పరిష్కరిస్తూ ప్రజలనుంచి కృజత్ఞతలు అందుకుంటూ ముందుకుసాగారు. వారు మాట్లాడుతూ పేద ప్రజల సంహొక్షేమమేధ్యేయంగా జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. గత మూడేళ్లలో జరిగిన అభివృద్ది ని చూసి మరోసారి వైస్సార్‌సీపీను గెలిపించాలని కోరారు.ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టిడిపి నాయకులు పస లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, సర్పంచ్‌లు రాఘురామిరెడ్డి, జయసుధమ్మ, ఎంపీటీసీ లక్ష్మినర్సయ్య, నేతలు సాధిక్‌భాషా, రమేష్‌బాబు,కళ్యాణ్‌భరత్‌, శంకర్‌రెడ్డి,సుబ్రమణ్యం తదితరులున్నారు.

Post Midle

Tags: Welfare is the path of the government

Post Midle