Natyam ad

సియం వైఎస్ జగన్ తోనే సంక్షేమం

-అభివృద్ధి నిరోధకులు ప్రతి పక్షాలు
-డిప్యూటీ సిఎం ఎస్ బి అంజాద్ భాషా

కడప ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమం త్రి,తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రతి పక్ష పార్టీలైన టిడిపి,జనసేనలు అభివృద్ధి నిరోధకులు గా మారి  మ అల్లరి చేయడమే కాకుండా, కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని డిప్యూటీ సీఎం ఎస్ బి అంజాద్ భాషా అన్నారు వీటిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు . జననేత వై.య‌స్‌.జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు  అర్పించారు. అనంతరం కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా తో పాటు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, రాష్ట్ర చైర్మన్లు యానాదయ్య, కరీముల్లా, పులి సునీల్ కుమార్,సీనియర్ నాయకులు మాసిమా బాబు, అఫ్జల్ ఖాన్, నారపు రెడ్డి సుబ్బారెడ్డి, డాక్టర్ సోహెల్ అహ్మద్, బంగారు నాగయ్య యాదవ్, తోట కృష్ణ, ఆదిత్య, పత్తి రాజేశ్వరి, టి.పి.సుబ్బమ్మ, కృష్ణవేణి, రత్నకుమారి, మూల సరస్వతి, మరియు రాష్ట్ర డైరెక్టర్లు,కార్పొరేటర్లు, నాయకులు నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Welfare is with Syam YS Jagan

Post Midle

Leave A Reply

Your email address will not be published.