Natyam ad

అన్నివర్గాల సంక్షేమమే్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వధ్యేయం –మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

–57 మంది షికారీలకు భూములఅనుభవ పత్రాలు పంపిణీ
–30 మంది గృహనిర్మాణలకు అనుభవ పత్రాలు అందజేత
— ఆనందం వ్యక్తం చేసిన షికారీలు

చౌడేపల్లె ముచ్చట్లు:


వైస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం చౌడేపల్లె మండల పరిషత్‌ కార్యాలయంలో దిగువపల్లె పంచాయతీ షికారిపాళ్యం, పక్షిరాజపురంకు చెందిన 57 మంది రైతులకు సుమారు 98 ఎకరాల వ్యవసాయ సాగుభూములకు అనుభవ ్య్యధృవ పత్రాలను మంత్రి పెద్దిరెడ్డి అంజేశారు. వారితోపటు చౌడేపల్లె సంతగేటు సమీపంలో గత కొన్నేళ్లుగా దేవదాయశాఖకు చెందిన భూముల్లో నివాసమున్న 30 మంది లబ్దిదారులకు ఆస్థలంపై సర్వహక్కులు పొందేలా పొజీషన్‌ సర్టిఫికెట్లును పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి లబ్దిచేకూర్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కిదన్నారు. షికారీలకు మంజూరు చేసిన వ్యవసాయ భూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన పనులను గుర్తించి పొలాల్లో పనులు చేపట్టి శాశ్వత జీవనోపాధి పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇంకనూ సుమారు 150 ఎకరాల్లో ఉన్న రైతులకు అనుభవ దృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉందని వారం రోజుల్లో మిగిలిన లబ్దిదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కొన్నేళ్లుగా ఎదురుచుస్తున్న షికారీల సమస్యను మంత్రి పరిష్కరించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 

 

Post Midle

ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన గి హామీలను 95 శాతం మేరకు అమలుచేశామని, ఇవ్వని హామీలను కూడా నె రవేర్చామన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆధరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షపార్టీలు అనవసరంగా బురద జల్లి రాద్దాంతం చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే్య ధ్యేయంగా పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, టిటిడిపాలక మండళి సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌,పాల ఏకరి కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మురళ్యీధర్‌, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, మాజీ ఎంపీపీలుఅంజిబాబు, రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి,సర్పంచ్‌లు వరుణ్‌భరత్‌, సోని, లక్ష్మిదేవి,భాగ్యవతి, ఎంపీటీసీ శ్రీరాములు ఉపసర్పంచ్‌ అల్తాఫ్‌, కోఆప్షన్‌మెంబరు సాధిక్‌ భాషా,ఎంపీడీఓ సుధాకర్‌, తహసీల్దార్‌ మాధవరాజు, సర్వేయర్లు మురళీకృష్ణ,నీలిమ తదితరులున్నారు.

Tags: Welfare of all sections is the mission of YSRCP government–Minister Dr. Peddireddy Ramachandra Reddy

Post Midle