వైభవంగా గోదాశ్రీరంగనాథుల కల్యాణం
సింహాచలం ముచ్చట్లు:
దేవస్థానం ఆధీనంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో గోదాశ్రీరంగనాథుల కల్యాణం కమణీయంగా జరిగింది. భోగిపండుగా పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జరిగిన గోదా కల్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు సంప్రదాయంగా ముగిసాయి. కల్యాణంలో భాగంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక
వేదికపై అధిష్టింపజేసి అర్చక పరివారం ఆగమోక్తంగా వేడుక నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి, అంతరాలయంలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకొని తరించారు.ఈవో ఎంవి.సూర్యకళ, ఏఈవో వై.శ్రీనివాసరావు ఉత్సవాన్ని పర్యవేక్షించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Welfare of Godashriranganaths in glory