Natyam ad

పేద ప్రజల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం-మంత్రి తలసాని

హైదరాబాద్ ముచ్చట్లు:


పేద ప్రజల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.గురువారం నాడు అయన సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నూతన పెన్షన్ ల మంజూరు పత్రాలను అందజేసారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 రూపాయల కు పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయి. 57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుండి అందిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు.

 

Tags: Welfare of poor people is Telangana government’s mission- Minister Talasani

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.