Natyam ad

కార్మికుల సంక్షేమం జగన్ తోనే సాధ్యం

-చంద్రబాబు పాలనలో కార్మిక వ్యవస్థ నిర్వీర్యం

-వై ఎస్ ఆర్ టీ యు సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి ఉద్ఘాటన

 

నెల్లూరు ముచ్చట్లు:

Post Midle

కార్మికుల సంక్షేమం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యమని, చంద్రబాబు పాలనలో కార్మిక వ్యవస్థ నిర్వీర్యమయిందని వై ఎస్ ఆర్ టీ యూ సి జోనల్ ఇంచార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి ఉద్ఘటించారు.గురువారం మధ్యాహ్నం నెల్లూరు లోని వై ఎస్ ఆర్ సి పి జిల్లా కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం జగన్ మెహన్ రెడ్డి తోనే సాధ్యమని, చంద్రబాబు బాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో 15 వేల గ్రామ వార్డు సచివాలయాలను తీసుకోని వచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకోని వచ్చి 1 లక్ష 50 వేల ఉద్యోగాలను యువతను నియమించిన ఘనత జగన్ దేనని అన్నారు. 2వాళ్ళులక్షల 50 వేల నిరుద్యోగ యువతను వాలంటీర్లుగా నియమించినారని అన్నారు.

 

 

 

 

విశాఖపట్నం లో జీ ఐ ఎస్ సదస్సును ఏర్పాటు చేసి ఉద్దాండులైన పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకోని వచ్చి 6 లక్షల ఉద్యోగాలు తీసుకోని వచ్చారని అన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు 2018-19సం. లో 3.2శాతం ఉండగా 2021-21 సం లో 12.8శాతనికి పెరిగిందని అన్నారు. 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్భర్లు, 2 ఎయిర్ పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు జగన్ మోహన్ రెడ్డి తీసుకోని వచ్చారని దాని ద్వారా వేలాది మంది యువతకి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇంకా అనేక రాంగాలల్లో వారికీ అనేక పథకాలు ద్వారా లబ్ది పొందడం జరిగిందని అన్నారు. మరొక సారి జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసుకొంటే మరింత అభివృద్ధి చేసుకోవచని కార్మికులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

 

 

 

వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండ్ల రాజేష్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాడ్లడినారని అన్నారు.చంద్రబాబు గోబెల్స్ కు ప్రతి రూపమని అన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి కి సంబందించి సర్కారు పేపర్ మిల్లుని, నెల్లూరు షుగర్ ప్యాకేటరీ, నిప్పో బ్యాక్టరీ, సిరామిక్ ప్యాకెటరిలతో పాటు పదుల సంఖ్యలో చిన్న పరిశ్రమల్ని ముసివేసి వేలాది మంది కార్మికుల ను చంద్రబాబు రోడ్డును పడేసారు. నెల్లూరు పార్లమెంట్ మరియు అసెంబ్లీ లకు పోటీ చేస్తున్న YSR పార్టీ అభ్యర్థులు లను గెలిపించాలను కోరారు.ఈ విలేకరుల సమావేశంలో వైస్సార్ తీయుసి జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి వరప్రసాద్ రెడ్డి, సునీల్ గవాస్కార్ పాల్గొన్నారు.

 

Tags: Welfare of workers is possible only with Jagan

Post Midle