Natyam ad

అర్హులందరికి సంక్షేమ పథకాలు -మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా తెలిపారు. గురువారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌.పేటలో ఇంటింటికి వెళ్లి జగనన్న బావుట బుక్‌లెట్లను పంపిణీ చేసి , సంక్షేమ పథకాల పంపిణీ పై ఆరా తీశారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కులమతాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించి, ఆదర్శమైన పాలన సాగిస్తున్నామన్నారు. అలాగే సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సమస్యలు లేని పట్టణాన్ని తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు భారతి, రాఘవేంద్ర, త్యాగరాజు, అమ్ము, నరసింహులు, రేష్మా, కాళిదాసు, మనోహర్‌, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Welfare schemes for all eligible – Municipal Chairman Aleembasha

Post Midle

Leave A Reply

Your email address will not be published.