పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు

చౌడేపల్లె ముచ్చట్లు:

రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని జెడ్పిటీసీ సభ్యుడు ఎన్‌. దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు అన్నారు. సోమవారం గడప గడపకూమన ప్రభుత్వం కార్యక్రమాన్ని 29 ఏ చింతమాకులపల్లె పంచాయతీ పరిధిలోని ఖాన్‌సాబ్‌మిట్ట, బయ్యప్ప్రల్లె, చింతమాకులపల్లె గ్రామాల్లో 447 కుటుంభాల్లో ఇంటింటా పర్యటిస్తూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ లబ్దిపొందినవారికి బావుటా పుస్తకాలను అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతుండడంతో గ్రామాల్లో సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలనుంచి వచ్చిన సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరిస్తూ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, కో ఆప్షన్‌మెంబరు సాధిక్‌భాషా, సర్పంచ్‌ హైమావతి,డిసిసిబి డైరక్టర్‌ రమేష్‌బాబు, ఎంపీటీసీ శ్రీరాములు, పీహెచ్‌సీ కమిటీ చైర్మన్‌ కళ్యాణ్‌భరత్‌, ఏఎంసీ డైరక్టర్‌ సుబ్రమణ్యం, నరసింహారెడ్డి, వెంకట్రమణ, రవికుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, చిన్నా, షఫీ, ఉపసర్పంచ్‌ అల్తాఫ్‌,సద్దాం, లాజర్‌,రఘు,రంగనాథ్‌, జెల్లిచంద్ర,రెడ్డెప్ప, గోవిందు తదితరులున్నారు.

 

Tags: Welfare schemes for all the eligible irrespective of parties

Leave A Reply

Your email address will not be published.